: ఇంట్లోంచి పారిపోయిన ఐదుగురు విద్యార్థినుల ఆచూకీ ల‌భ్యం!


హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన ఐదుగురు విద్యార్థినులు నిన్న ఎవరికీ చెప్ప‌కుండా ఇంట్లోంచి వెళ్లిపోయి అల‌జ‌డి రేపారు. ఈ విష‌య‌మై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఈ రోజు వారి ఆచూకీని క‌నుగొన్నారు. సంగీత(12), ప్రీతి(12), నందిని(12), శ్రీనిధి(12), ప్రతిభ(12) అనే అమ్మాయిలు క‌నిపించ‌కుండా పోయార‌ని నిన్న వారి త‌ల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకోగానే 4 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వారి ఆచూకీ కోసం ఆరా తీశారు. ఆ విద్యార్థినుల వద్ద ఉన్న‌ సెల్‌ఫోన్ల సిగ్నల్స్ ఆధారంగా కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని హైద‌రాబాద్‌కు తీసుకురానున్న‌ట్లు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు వివ‌రాలు తెలుపుతూ... వారంతా అంబ‌ర్‌పేట్‌లో ప్రగతి విద్యానికేతన్‌లో ఏడో తరగతి చదువుతున్నార‌ని, నిన్న‌ సాయంత్రం 7 గంటలకు ఇంట్లో దాచిన నగదు తీసుకుని వెళ్లిపోయినట్లు వారి తల్లిదండ్రులు చెప్పారని అన్నారు.

  • Loading...

More Telugu News