: తెలంగాణకు భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం


తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అమృత్ పథకం కింద తెలంగాణకు భారీగా నిధులు మంజూరు చేసింది. అటల్ మిషన్ నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 12 పట్టణాలను అభివృద్ధి చేసేందుకు రూ. 832 కోట్లను కేంద్రం ఇస్తోంది.

ఆయా పట్టణాలకు కేటాయించిన నిధులు ఇవే...
  • వరంగల్ - రూ. 425.70 కోట్లు
  • సిద్ధిపేట - రూ. 101.5 కోట్లు
  • ఖమ్మం - రూ. 48.84 కోట్లు
  • మహబూబ్‌ నగర్ - రూ. 43.08 కోట్లు
  • నిజామాబాద్ - రూ. 32.31 కోట్లు
  • కరీంనగర్‌ - రూ. 26.48 కోట్లు
  • నల్గొండ - రూ. 12.03 కోట్లు
  • మిర్యాలగూడ - రూ. 5.87 కోట్లు
  • సూర్యాపేట - రూ. 2.70 కోట్లు
  • జీహెచ్‌ఎంసీ - రూ. 2.02 కోట్లు
  • రామగుండం - రూ. 1.50 కోట్లు
  • ఆదిలాబాద్ - రూ. 95 లక్షలు

  • Loading...

More Telugu News