: అలాంటి ప్రచారాన్ని ఆమోదించను!: ప్రధాని అభ్యర్థిగా తనను ప్రకటించాలన్న పిటిషన్ పై స్పందించిన శశి థరూర్


యూపీఏ ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ ను 2019 ఎన్నికల కోసం ప్రకటించాలని కోరుతూ కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఓ వ్యక్తి చేంజ్ డాట్ ఓఆర్జీ అనే వెబ్ సైట్ లో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై శశిథరూర్ ఈ రోజు స్పందించారు. తనకు అటువంటి కోర్కెలేవీ లేవని స్పష్టం చేశారు. ‘‘చేంజ్ డాట్ ఓఆర్జీ లో పిటిషన్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. కాంగ్రెస్ పార్టీలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ నాకు గొప్ప బాధ్యతలు అప్పగించాలన్న సూచన అందులో ఉంది. కానీ, ఈ విధమైన ప్రచారానికి మద్దతు ఇవ్వడం గానీ, ఆమోదించడం గానీ చేయను’’ అని శశి థరూర్ స్పష్టం చేశారు.

‘‘ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. నాపై విశ్వాసం ఉంచిన అతనికి, ఈ పిటిషన్ పై సంతకం చేసిన వారికీ ధన్యవాదాలు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడ్ని మాత్రమే. అంతకు మించి ఏమీ లేదు. పార్టీకి నాయకత్వం ఉంది. అందులో ఏవైనా మార్పులు చేయదలిస్తే అందుకు ఓ విధానం అంటూ ఉంది’’ అని థరూర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News