: హైదరాబాదులోని బస్ షెల్టర్లు దారుణంగా ఉన్నాయి: కేటీఆర్
జీహెచ్ఎంసీ పరిధిలోని బస్సు షెల్టర్ల నిర్వహణ చాలా దారుణంగా ఉందని తెలంగాణ మున్సిపల్, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాదులో మొత్తం 1183 బస్ షెల్టర్లు ఉన్నాయని... వీటిలో 430 బస్ షెల్టర్ల ఆధునికీకరణ కోసం టెండర్లను పిలిచామని చెప్పారు. ఈ బడ్జెట్లో జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు కేటాయించామని తెలిపారు. రవాణా వ్యవస్థను కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసువచ్చే ఆలోచన ఉందని చెప్పారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ పైవివరాలను వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాల్లో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు.