: 19న కొలువుదీరనున్న యూపీ ప్రభుత్వం
ఈ నెల 19వ తేదీన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. లక్నోలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. అయితే, యూపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, టెలికాం మంత్రి మనోజ్ సిన్హా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్యలు సీఎం రేసులో ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి.