: అరుదైన‌ రికార్డు సృష్టించిన మ్యాక్స్‌వెల్


రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ మ్యాక్స్‌వెల్  సెంచ‌రీ బాదిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ సెంచ‌రీ ద్వారా ఆయ‌న ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ టెస్టు ద్వారా ఆయ‌న తొలి సెంచ‌రీ న‌మోదు చేసుకొని ఆస్ట్రేలియా తరఫున టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో శతకాలు నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గతంలో షేన్‌ వాట్సన్ ఈ మూడు ఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.  
 
మ్యాక్స్‌వెల్‌ 2015 మార్చిలో శ్రీలంకపై వన్డేల్లో సెంచ‌రీ సాధించాడు. గ‌త ఏడాదిలోనూ శ్రీలంకపైనే టీ20ల్లో సెంచ‌రీ చేశాడు. ఇక ఈ ఏడాది టెస్టుల్లో భార‌త్‌పై తొలి శతకం(104) సాధించాడు.


  • Loading...

More Telugu News