: రోజాపై చంద్రబాబుకు ఎందుకంత వ్యక్తిగత కక్ష?: వైవీ సుబ్బారెడ్డి


వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యక్తిగత కక్ష ఎందుకంటూ ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని... ఇప్పుడు మళ్లీ మరో ఏడాది పాటు సస్పెండ్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. రోజాను మరోసారి సస్పెండ్ చేస్తే తాము న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

ఇక కేంద్ర జీడీపీ కన్నా రాష్ట్ర జీడీపీ ఎక్కువగా ఉందంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. 2018 నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారని... ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ. 2,800 కోట్లు అవసరమవుతాయని... కానీ, బడ్జెట్ లో కేవలం రూ. 200 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు.

  • Loading...

More Telugu News