: ఆ ఇద్దర్నీ తమకు అప్పగించాలని పాకిస్థాన్ ను కోరిన భారత్


పాకిస్థాన్ పర్యటనకు వెళ్లి కనిపించకుండా పోయిన ఇద్దరు ఇస్లాం మతాధికారులను గుర్తించి తిరిగి తమకు అప్పగించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని భారత సర్కారు కోరింది. ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ అలియా దర్గాకు చెందిన అసిఫ్ నిజామి, ఆయన సోదరుడు నాజిమ్ నిజామిలు బుధవారం లాహోర్ లో అదృశ్యమయ్యారు. వీరిని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అపహరించుకుపోయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో, వీరి అదృశ్యాన్ని కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. ఇస్లామాబాద్ లోని భారత హైకమిషనర్ పాకిస్థాన్ విదేశాంగ శాఖకు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ లో సుఫీ తెగకు చెందిన వారిపై జీహాదీల దాడులు పెరిగిపోయాయి. ఇప్పుడు అదృశ్యమైన ఇద్దరు మతాధికారులు కూడా సుఫీ తెగకు చెందిన వారే కావడం గమనార్హం. అయితే, నిజామీ సోదరులను జీహాదీ గ్రూపులు అపహరించి ఉండకపోవచ్చని స్థానిక భద్రతా బలగాల నుంచి అభిప్రాయం వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News