: భారీగా పట్టుబడిన రద్దయిన కరెన్సీ నోట్లు... ఎస్ఆర్ నగర్ లో స్వాధీనం
రద్దయిన పెద్ద నోట్లు మరోసారి భారీ మొత్తంలో వెలుగు చూశాయి. హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో బీకే గూడ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.44.48 లక్షల విలువ జేసే రూ.500, రూ.1,000 నోట్లను బుధవారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. పి.శ్రీధర్(46) అనే ఓ మార్కెటింగ్ కంపెనీ జోనల్ మేనేజర్ ను, అతని స్నేహితులు డి.శ్రీనివాసరావు (40), కృష్టారెడ్డిలను అరెస్ట్ చేశారు. కొంత కాలం క్రితం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను మార్చుకునేందుకు గాను వీరు కమ్యూనిటీ హాల్ వద్ద కారులో వేచి ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.500 నోట్లు 6,013, రూ.1,000 నోట్లు 1,442, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.