: గ్రీన్ టీ ఎక్కువ తాగేవారికి హెచ్చరిక!
గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని అనేక మంది భావిస్తుంటారు. ఇది నిజమే. గ్రీన్ టీ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అయితే మోతాదు మించితే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజు మొత్తంలో ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ మాత్రమే సేవించాలని... అంతకు మించి తాగొద్దని వీరు చెబుతున్నారు. గ్రీన్ టీని ఎక్కువ మోతాదులో తీసుకునే స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఎలుకల మీద నిర్వహించిన పరిశోధనలో వారు ఈ విషయాన్ని గమనించారు.