: రాంచీ టెస్టు: విరిగిపోయిన ఆసీస్ ఆటగాడి బ్యాట్.. నవ్వులే నవ్వులు!
రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. అయితే, మ్యాచ్ ప్రారంభం కాగానే ఉమేశ్‌యాదవ్ వేసిన తొలి బంతిని ఎదుర్కోనే క్రమంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్ విరిగిపోయింది. దీంతో మైదానంలోని ఆటగాళ్లంతా చిరునవ్వులు చిందించారు. ఆస్ట్రేలియా నిన్న నాలుగు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆసీస్ ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, స్మిత్‌లు సెంచరీలతో మైదానంలో పాతుకుపోయారు. స్మిత్ 124, మ్యాక్స్‌వెల్ 104 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 329 పరుగులతో(100 ఓవర్లకి) ఆటకొనసాగిస్తోంది.