: నిట్ట నిలువునా చీలనున్న ఆమ్ ఆద్మీ పార్టీ?


ఆమ్ ఆద్మీ పార్టీ నిట్టనిలువునా చీలనుందనే వార్తలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాల మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు ఇంతకు ముందు నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దారుణంగా ఓటమిపాలు కావడంతో, వీరిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయని తెలుస్తోంది. ఈ ఓటమి తర్వాత సిసోడియా వర్గం కేజ్రీవాల్ పై తీవ్ర ఆగ్రహంతో ఉందని ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ అన్నారు. దీంతో త్వరలోనే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోనుందనే సమాచారం తనకు తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు. 

  • Loading...

More Telugu News