: ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గురు ‘షార్’ ఉద్యోగులు


నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని ముగ్గురు ఉద్యోగులకు ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఉద్యోగులు పనిచేస్తున్న కంటెయినర్‌లో ఆక్సిజన్ ఖాళీ అయిపోవడంతో శ్వాస అందక వారు ఇబ్బంది పడ్డారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని ఉద్యోగులను రక్షించి వారి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News