: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..అంబులెన్స్‌ను ఢీకొట్టిన రైలు.. ఐదుగురి దుర్మరణం


శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా మహిళలే. చిత్రదుర్గం జిల్లా మన్నెకోట వద్ద ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ను దాటుతున్న అంబులెన్స్‌ను వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. దాంతో అంబులెన్స్ తుక్కుతుక్కుగా మారిపోయింది. ఐదుగురు మహిళలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అయితే, విచిత్రంగా ఐదు నెలల చిన్నారి సహా అంబులెన్స్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను చళ్లెకెర తాలూకా తిమ్మాపుర వాసులుగా గుర్తించారు.

  • Loading...

More Telugu News