: అప్పుడు ఎన్టీఆర్ నన్ను ఒక తన్ను తన్నారు!: హాస్య నటుడు వేణు మాధవ్

కమెడియన్ వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పని చేసేవాడు. అక్కడ పని చేస్తున్న సందర్భంలో తనకు జరిగిన ఓ అనుభవం గురించి ఒక ఇంటర్వ్యూలో వేణు మాధవ్ చెబుతూ.. ‘సినిమాల్లోకి రాకముందు టీడీపీ ఆఫీసులో టెలిఫోన్ ఆపరేటర్ గా పని చేశాను. అప్పుడు నా జీతం నెలకు రూ. 600. ఒక్కోసారి ఎన్టీఆర్ నివాసం వద్ద నైట్ డ్యూటీ వేసే వారు. ఒకసారి, తెల్లవారు జామున ఎన్టీఆర్ ఇంట్లో లైట్ ఆపడం మర్చిపోయాను. ఈ విషయాన్ని ఎన్టీఆర్ గ్రహించారు. నన్ను పిలిచి క్లాస్ పీకారు. నన్ను వెనక్కి తిరగమని చెప్పి, ఒక్క తన్ను తన్నారు. దీంతో, బయటకు వచ్చేశాను.

అయితే, కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి ఎన్టీఆర్ పిలుస్తున్నారని చెప్పాడు. ఇంకేం జరుగుతుందోనని నాకు భయం వేసింది. భయపడుతూ.. ఎన్టీఆర్ గదిలోకి వెళ్లాను. నేతి దోశ తింటున్న ఎన్టీఆర్.. నన్ను చూసి ‘రండి బ్రదర్’ అన్నారు. ఆయన తింటున్న దోశలో నుంచి ఓ ముక్క తీసి నాకు ఇచ్చారు. దానిని పట్టుకుని నేను అక్కడే నిల్చున్నాను. ‘ఏం బ్రదర్, ఇంకా ఏమైనా తింటారా?’ అని  అడిగారు. ‘వద్దు అన్నగారు’ అని చెప్పాను. ‘బాధ్యతగా ఉండండి. మీరిక వెళ్లొచ్చు’ అని ఎన్టీఆర్ అన్నారు’' అంటూ వేణుమాధవ్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

More Telugu News