: రెండు దెబ్బలతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు: రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు విడుదలైన ‘బాహుబలి -2’ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా, కొన్ని నిమిషాల క్రితం మరోమారు వర్మ ట్వీట్ చేస్తూ, హీరో ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘బాహుబలి-2 తర్వాత ప్రభాస్ కాలి గోటిని అందుకోవడానికి టాలీవుడ్ లోని పవర్ ఫుల్ మెగా సూపర్ స్టార్ లందరికీ కూడా రెండున్నర జన్మలు పడుతుంది. టాలీవుడ్ పవర్ ఫుల్ స్టార్లు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేసి ఘోరంగా ఫెయిల్ అయి, ప్రాంతీయంగా అయిపోయారు. ప్రభాస్ రెండు దెబ్బలతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు అంటూ వర్మ పేర్కొన్నారు.