: ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం: ఎన్నికల కమిషన్ స్పష్టీకరణ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయ్యాయని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి ఆరోపించగా, త్వరలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని, వాటిపై తమకు నమ్మకం లేదని సీఎం కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యానించడం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించింది.
ఈవీఎంలపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఈవీఎం లను వినియోగించడం కారణంగా రిగ్గింగ్ జరుగుతోందనే ఆరోపణలను ఖండించింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడానికి సాధ్యం కాదని, పూర్తిగా ట్యాంపర్ ప్రూఫ్ ఉంటుందని పేర్కొంది. ఈ విషయమై ఆరోపణలు చేస్తే పట్టించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఎన్నికల్లో వీటిని వినియోగించడం ద్వారా కచ్చితమైన ఓటింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొంది. సరైన సాంకేతికత, భద్రతా ప్రమాణాలతో ఈవీఎంలను తయారు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.