: వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తే జీవితాలు నాశనం అవుతాయి: నటి హేమ
ఏదైనా ఒక వ్యవహారంలో ఎవరైనా నటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో, వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలను ప్రసారం చేయవద్దని ప్రముఖ నటి హేమ కోరింది. ఇటువంటి వార్తలు పదే పదే ప్రసారం చేయడం వల్ల వారి జీవితాలు నాశనమవుతాయని, అందుకు, మీడియా కూడా పరోక్షంగా కారణమవుతుందని అన్నారు. అలాంటి వార్తలు ప్రసారం చేసే వారు డబ్బులు సంపాదిస్తే సంపాదించవచ్చు కానీ, ఒకరిని నాశనం చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్లు తమ కుటుంబసభ్యులకు సంతోషంగా తిండి పెట్టగలరా? అని హేమ ప్రశ్నించింది. ఎఫైర్స్, సెక్స్ రాకెట్ వంటి కేసుల్లో నిజానిజాలు తెలుసుకోకుండా నటి పేరు బయట పెడుతూ వార్తలు ప్రసారం చేయవద్దని కోరుకుంటున్నానని, దయచేసి, అటువంటి వార్తలు ఆపాలని ఆమె మీడియాకు విన్నవించుకుంది.