: పాకిస్థాన్ లో శాడిస్టు భర్త నుంచి ఆమెను విడిపించండి: రాయబారికి సుష్మ స్వరాజ్ ఆదేశం


హైదరాబాదులోని బండ్లగూడకు చెందిన మహమ్మది బేగం (44) కు భర్తనుంచి విముక్తి కల్పించాలని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ లోని భారత్ రాయబారి గౌతమ్ బొంబావాలాను ఆదేశించారు. లాహోర్‌ కు చెందిన మహ్మద్‌ యూనిస్‌ (60) తో మహమ్మది బేగంకు 1996లో వివాహమయింది. ఒమన్ దేశస్తుడినంటూ ఫోన్ పెళ్లి ద్వారా నిఖా చేసుకున్నాడు. అనంతరం మస్కట్‌ లో పెట్టిన కాపురం కారణంగా వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఆ తరువాత తాను పాకిస్థానీనని నిజం బయటపెట్టాడు. మహ్మద్ యూనిస్ ఉద్యోగం ఊడిపోవడంతో వారి కాపురం లాహోర్ కి మారింది.

 దీంతో అతని అసలు రంగు బయటపడడం మొదలైంది. ఆమె ఇండియా పాస్ పోర్టును రెన్యువల్ చేయించలేదు. దీనికి తోడు ఆమెని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. జరిగిన సంఘటన తన తండ్రికి చెప్పి భోరున విలపించి తనను ఆ నరకం నుంచి బయటకు తీసుకురావాలని కోరింది. బండ్లగూడలో సైకిల్‌ మెకానిక్‌ గా పనిచేస్తున్న ఆమె తండ్రి మహ్మద్‌ అక్బర్‌ ఈ-మెయిల్ ద్వారా తన కుమార్తె కష్టాన్ని సుష్మా స్వరాజ్ కు వివరించగా, ఆమె స్పందించి పాక్ లోని భారతీయ విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. 

  • Loading...

More Telugu News