: ప్రధానిని టీడీపీ వాళ్లూ విమర్శించారు : ఎమ్మెల్సీ సోము వీర్రాజు
ఎన్నో మంచి పనులు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ వాళ్లూ విమర్శించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. చివరకు, సినీ నటులు కూడా మోదీని ఏకవచనంతో సంబోధించారని, అమెరికాలో ఉండే మరో సినీ నటుడు కూడా మోదీని ‘సన్నాసి’ అన్నారని, ఆ సినీ నటుడి మాటల వెనుక ఓ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ కు కేంద్ర కేబినెట్ చట్టబద్ధత కల్పించినందుకు, ప్రధానికి తన ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. హోదాతో రూ.3,500 కోట్లు వస్తే, ప్యాకేజ్ తో రూ.42 వేల కోట్లు వస్తాయని అన్నారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని సోము వీర్రాజు ఆరోపించారు.