: మా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి వస్తారు: ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ


తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి వస్తారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు. ఓ టీవీ చానెల్ తో ఆమె మాట్లాడుతూ, తమకు ఎలాంటి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లేదని తెలిపారు. తన తల్లిదండ్రుల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉందని, పార్టీ కార్యకర్తలందర్నీ ఏకతాటిపై నడిపించే బాధ్యత తనపై ఉందని ఆమె తెలిపారు. తన తండ్రి తన చివరి కోరిక సీఎం చంద్రబాబుగారికి చెప్పారని, దానిని నెరవేర్చేందుకు ఆయన మద్దతిస్తామన్నారని, తాను కూడా దానిని నెరవేరుస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా నిలబడతానని, తనకు కార్యకర్తలు అండగా ఉన్నారని ఆమె చెప్పారు. 

  • Loading...

More Telugu News