: ప్రతిభావంతులకు ఇది చక్కటి వేదిక: మహేష్ బాబు
హైదరాబాదులోని యప్ టీవీ ఒరిజనల్స్ ను ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమ విస్తరిస్తోందని అన్నాడు. పరిశ్రమ ఎంత విస్తరిస్తే వ్యాపారం అంత ఎక్కువ జరుగుతుందని, అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయని అన్నాడు. ఈ అవకాశాలను ప్రతిభావంతులు అందుకుంటారని మహేష్ బాబు చెప్పాడు. సినీ పరిశ్రమలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారని తెలిపాడు. వారందరికీ ఇలాంటి వేదికలు మంచి అవకాశాలు కల్పిస్తాయని ఆకాంక్షిస్తున్నానని చెప్పాడు. ఇలాంటి వేదికలను ప్రతిభావంతులు వినియోగించుకోవాలని మహేష్ బాబు సలహా ఇచ్చాడు. సుమంత్ తో రూపొందించిన వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుందని తెలిపాడు.