: రిలయన్స్ జియో ఉచిత సర్వీసుపై స్టే ఇవ్వలేమని చెప్పిన అప్పీలేట్ ట్రైబ్యునల్
రిలయన్స్ జియో అందిస్తోన్న ఉచిత ఆఫర్లపై మిగతా టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, ఐడియా కలసి టెలికాం వివాదాల కమిటీ, అప్పీలేట్ ట్రైబ్యునల్ (టీడీఎస్ఏటీ)లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై విచారించిన టీడీఎస్ఏటీ ప్రమోషనల్ ఆఫర్ కింద జియో ఇస్తున్న ఉచిత సర్వీసుపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో రిలయన్స్ జియోకు ఊరట లభించింది. అయితే, ఫ్రీ ఆఫర్లను పునఃపరిశీలించాలని ట్రాయ్‌కు ట్రైబ్యునల్ సూచించింది. జియో ఆఫర్ల అంశంపై తమకు రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని చెప్పింది. కాగా, రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్లు ఈ నెల 31తో ముగుస్తోన్న విషయం తెలిసిందే.