: పెరిగిన బంగారం, వెండి ధరలు


మార్కెట్లో ఈ రోజు ప‌సిడిధ‌ర పైకి ఎగిసింది. ఈ రోజు రూ.450 పెరిగి 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. 29,100గా న‌మోదైంది. బంగారం దుకాణదారుల నుంచి డిమాండ్ పెర‌గ‌డంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వల్ల బంగారం ధ‌ర మ‌ళ్లీ 29 వేల రూపాయ‌ల‌ మార్కును దాటింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు వెండి ధ‌ర కూడా ఈ రోజు ఏకంగా రూ. 1000 పైగా పెరిగి కిలో వెండిధ‌ర రూ. 41వేల పైకి చేరింది. మార్కెట్లో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 41,350గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరిగాయ‌ని, అందుకే వెండి ధ‌ర పెరిగింద‌ని విశ్లేష‌కులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News