: ఎమ్మెల్యేగా గెలిచిన వారం రోజులకే రాజీనామా చేసిన గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో కాంగ్రెస్‌కి 17 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, భారతీయ జనతా పార్టీకన్నా నాలుగు సీట్లు ఎక్కువగానే గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంపై అధిష్ఠానం వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులయినా కాకముందే ఆ పార్టీలో ఇలా తిరుగుబాటు వచ్చింది.