: ప్రతి ఒక్కరూ బంతిని బౌండరీ దాటించాలనుకుంటే...రాజమౌళి బౌండరీ లైన్ నుంచి పక్కకి తోసేస్తాడు: రామ్ ఆసక్తికర ట్వీట్


తాజాగా సోషల్ మీడియాలో విడుదలైన 'బాహుబలి 2' సినిమా ట్రైలర్ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినీ నటులు తమదైన శైలిలో ఈ సినిమా దర్శకుడు రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా యువనటుడు రామ్ పోతినేని తనదైన శైలిలో 'బాహుబలి 2'పై ట్విట్టర్లో వ్యాఖ్యానిస్తూ... 'సాధారణంగా ఏ ఆటగాడైనా బంతిని బౌండరీ లైన్ దాటించాలనుకుంటాడు. ప్రతి సినీ దర్శకుడూ తన సినిమా సూపర్ హిట్ అవ్వాలని భావిస్తాడు. కానీ రాజమౌళి కాస్త డిఫరెంట్. బౌండరీ లైన్ కు వచ్చిన బంతిని పక్కకి నెట్టేసి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతాడు. అది బౌండరీనా? లేక సిక్సరా? అన్న ఆసక్తిని పెంచి ఒక్కసారి ఉత్కంఠకు తెరదించుతాడు' అన్నాడు.

ట్రైలర్ అద్భుతంగా ఉందని చెబుతూ, ఈ సినిమా 'ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా' అని నాలుక్కరుచుకుని.. సారీ ఈ సినిమా 'ప్రైడ్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా' అని మళ్లీ నాలుక్కరుచుకుని... సారీ చెప్పి, ఈ సినిమా 'ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని చెప్పాడు. రామ్ ట్వీట్ కు అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. 

  • Loading...

More Telugu News