: గ్వాలియర్ పోలీసులా మజాకా... హోలీనాడు 'బీర్ల' పండగ!


గ్వాలియర్ పోలీసులు హోలీ జరుపుకున్న విధానం కలకలం రేపుతోంది. సాధారణంగా హోలీ అంటే రంగులు చల్లుకుని, భంగు తాగి డాన్సుల్లో మునిగి తేలుతారు. ఈ సంప్రదాయాన్ని కాస్త ఆధునికీకరించిన గ్వాలియర్ పోలీసులు పోలీస్ స్టేషన్ లో యూనిఫాంలోనే రంగులు చల్లుకుని హోలీ జరుపుకున్నారు. మధ్యలో భంగుకు బదులుగా బీర్లు తెచ్చుకుని తాగారు. ఒకరికి ఒకరు తాగించుకుని సంతోషంతో పొంగిపోయారు. పనిలో పనిగా బీర్లు అలవాటు లేని యువ కానిస్టేబుళ్లకు అధికారి స్థాయి వ్యక్తి ప్రేమతో బీరు పట్టించాడు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పోలీస్ స్టేషన్లలో బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

  • Loading...

More Telugu News