: దిగ్విజయ్ కు పదవీగండం.. అందుకే ఏవో భ్రమలు కల్పించే ప్రయత్నం చేశారు: గోవా సీఎం పారికర్


తమకు పూర్తి మెజారిటీ ఉందనే విషయాన్ని శాసనసభలో నిరూపించామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తమకు ఉందంటూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినా, తమకు అవకాశం ఇవ్వలేదంటూ దిగ్విజయ్ అబద్ధాలు చెప్పారని అన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి దిగ్విజయ్ తప్పుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చిందని... అందుకే లేనిపోని భ్రమలను సృష్టించే ప్రయత్నాన్ని ఆయన చేశారని పారికర్ మండిపడ్డారు. రంగు కళ్లద్దాలు పెట్టుకున్న నేతలు తమపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బల పరీక్షలో నెగ్గిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News