: ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించిన సిద్ధూ!
పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది. సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని ఆశించిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేవలం మంత్రి పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అమరీందర్ పాదాలకు సిద్ధూ నమస్కరించారు. వయసులో తనకంటే పెద్దవాడైన అమరీందర్ పై తనకున్న గౌరవాన్ని ఆ విధంగా ఆయన చాటుకున్నారు. వ్యక్తిగత లక్ష్యాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనే విషయాన్ని తన చర్యతో తెలియజేశారు.