: బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో విరాట్ కోహ్లీకి స్వల్ప గాయం!
రాంచీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది జరిగింది. ఇన్నింగ్స్ 39వ ఓవర్ తొలి బంతిని ఆసీస్ బ్యాట్స్ మెన్ హ్యాండ్స్ కాంబ్ బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపేందుకు కోహ్లీ డైవ్ చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ ఒక్క పరుగును సేవ్ చేసినప్పటికీ... స్వల్పంగా గాయపడ్డాడు. భుజం నొప్పికి గురవడంతో మైదానాన్ని వీడాడు. అనంతరం కాసేపటి తర్వాత మళ్లీ ఫీల్డింగ్ కు వచ్చాడు. కోహ్లీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడంతో భారత క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.