: ఛాన్సుల కోసం దిగజారే రకాన్ని కాను: ఇలియానా
సినిమాల్లో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో కొంతమంది దిగజారుతారు అనే టాక్ కూడా ఉంది. అయితే, తాను మాత్రం ఆ టైప్ కాదని అంటోంది గోవా బ్యూటీ ఇలియానా. అవకాశాల కోసం తాను దిగజారి బతకనని తెలిపింది. ఛాన్సులు ఇవ్వాలని కోరుతూ తాను ఎవరి వెంటా పడనని... అందుకే తనకు సినిమాలు తగ్గాయని చెప్పింది.
అంతేకాదు, ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే తన ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందని ఇల్లీ తెలిపింది. ఇతర హీరోయిన్లు, తనకన్నా ఎక్కువ వయసున్న భామలు కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంటే... ఇలియానాకు మాత్రం ఏడాదికి ఒక సినిమా రావడం కూడా కష్టమైపోతోంది. మరోవైపు, తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయిన విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలియానా ఇలాంటి కబుర్లు చెబుతోందంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.