: నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు వార్నర్ (19), రెన్షా(44) అవుటయిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్ మాత్రమే నిలుదొక్కుకొని అర్ధశతకం చేసి స్కోరు బోర్డుని కదిలిస్తున్నాడు. మార్ష్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కాగా, హెచ్.కాంబ్ కూడా 19 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి మ్యాక్స్ వెల్ వచ్చాడు. ప్రస్తుతం స్మిత్ 58, మాక్స్ వెల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా నాలుగువికెట్ల నష్టానికి 151 (45 ఓవర్లకి) పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్, జడేజాలకి చెరో వికెట్ దక్కగా, ఉమేష్ కి రెండు వికెట్లు దక్కాయి.