: వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అనారోగ్యం.. సభకు రాలేనంటూ స్పీకర్ కు లేఖ!
వైసీపీ ఎమ్మెల్యే రోజా అనారోగ్యానికి గురయ్యారు. ఈ రోజు అసెంబ్లీకి కూడా ఆమె రాలేదు. అనారోగ్య కారణాల వల్లే తాను అసెంబ్లీకి రాలేకపోతున్నానంటూ శాసనసభ స్పీకర్ కోడెలకు రోజా లేఖ రాశారు. ఈ రోజు రోజా సస్పెన్షన్ కు సంబంధించి ప్రివిలేజ్ కమిటీ తన నివేదికను సభలో ప్రవేశపెట్టింది. ఏడాది పాటు ఆమెను సస్పెండ్ చేయాలంటూ తన నివేదికలో సిఫారసు చేసింది. అయితే తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని మాత్రం సభకే వదిలేసింది. అయితే, రోజా అనారోగ్యానికి గురవడంతో, ఈ అంశంపై సోమవారం చర్చ జరిగే అవకాశం ఉంది.