: బలపరీక్షలో నెగ్గిన పారికర్.. అనుకూలంగా 22 ఓట్లు
ఈ రోజు గోవా అసెంబ్లీలో ఎదుర్కున్న బలపరీక్షలో ఆ రాష్ట్ర సీఎం మనోహర్ పారికర్ నెగ్గారు. ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యులు 13 మందితో పాటు ఇతర పార్టీలకు చెందిన మరో 9 మంది సభ్యులు బీజేపీకి అండగా నిలిచారు. మనోహర్ పారికర్ కు అనుకూలంగా మొత్తం 22 ఓట్లు పడడంతో ఆయన గెలిచినట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. దీంతో గోవాలో బీజేపీ సంకీర్ణ సర్కారు ఆ రాష్ట్రాన్ని పాలించనుంది. పారికర్ కు వ్యతిరేకంగా 16 ఓట్లు మాత్రమే పడ్డాయి. మొత్తం 17 మంది కాంగ్రెస్ సభ్యులున్న ఆ అసెంబ్లీలో ఒక కాంగ్రెస్ సభ్యుడు తమ అధిష్ఠానం తీరుకి వ్యతిరేకంగా వాకౌట్ చేశారు.