: తన తదుపరి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్య చేసిన రాజమౌళి


ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తన 'బాహుబలి-2' సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే... రాజమౌళి తదుపరి సినిమా ఏంటనే విషయంపై పెద్ద చర్చే జరిగింది. మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని కొందరు, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో సినిమాను నిర్మిస్తాడని మరికొందరు చెబుతూ వచ్చారు.
ఈ నేపథ్యంలో, 'బాహుబలి-2' ట్రైలర్ విడుదల సందర్భంగా రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ఈ సినిమాకు గ్రాఫిక్స్ సూపర్ వైజర్ గా పని చేసిన కమల్ కన్నన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, తన తదుపరి సినిమాను కమల్ సాయం లేకుండానే చేయాలనుందని అన్నాడు. అందుకే గ్రాఫిక్స్ లేకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. అంటే, తన తదుపరి సినిమా రెగ్యులర్ సోషల్ సినిమా అయి ఉంటుందని చెప్పకనే చెప్పాడు జక్కన్న.

  • Loading...

More Telugu News