: తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. వారసత్వ ఉద్యోగాల ప్రకటనను రద్దు చేసిన హైకోర్టు!
హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల ప్రక్రియను న్యాయస్థానం తప్పుబట్టింది. ఆ ప్రకటనను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఉద్యోగి మెడికల్ గ్రౌండ్స్ అన్ ఫిట్ అయి, ఆ కుటుంబంలో ఎటువంటి జీవనాధారం లేకుండా ఉంటే వారసత్వ ఉద్యోగం ఇవ్వచ్చని తెలిపింది. అంతేగాని, ప్రతి ఒక్క కుటుంబానికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వారసత్వ ఉద్యోగాలపై లబ్ది పొందే కుటుంబాలు సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, వారసత్వ ఉద్యోగాల నియామకాలపై గోదావరిఖనికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది.