: ఢీకొట్టిన షారుఖ్ ఖాన్ కారు.. ఫొటోగ్రాఫర్ కు గాయాలు


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కారు ఓ ఫొటోగ్రాఫర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు ఫొటోగ్రాఫర్ గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే, 'డియర్ జిందగీ' సినిమాలో తనతో పాటు నటించిన అలియాభట్ జన్మదినం కావడంతో ఆమె ఇంటికి షారుఖ్ వెళ్లాడు. దీంతో, ఎప్పట్లాగానే షారుఖ్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ఈ సందర్భంలో, షారుఖ్ కారు వేగంగా వస్తున్నప్పటికీ...దాన్ని పట్టించుకోకుండా ఓ ఫొటోగ్రాఫర్ షారుఖ్ ను ఫొటో తీసే పనిలో పడ్డాడు. దీంతో, షారుఖ్ కారు సదరు ఫొటోగ్రాఫర్ కాలిపై నుంచి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన షారుఖ్ వెంటనే కారు నుంచి దిగి వచ్చాడు. వెంటనే తన బాడీగార్డును తోడు ఇచ్చి, ఫొటోగ్రాఫర్ ను నానావతి ఆసుపత్రికి తరలించాడు. వైద్యానికి అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని... అతనికి పూర్తిగా బాగు అయ్యేంత వరకు తానే చూసుకుంటానని షారుఖ్ ఈ సందర్భంగా తెలిపాడు. షారుఖ్ గొప్ప మనసును చూసి అక్కడున్న వారంతా ఎంతో సంతోషించారు.

  • Loading...

More Telugu News