: గోవా అసెంబ్లీలో ప్రారంభమైన బలపరీక్ష
ఇటీవల గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సంపాదించుకోనప్పటికీ ఇతరుల మద్దతుతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో గోవా సీఎం మనోహర్ పారికర్ బలపరీక్ష ఎదుర్కుంటున్నారు. సభలో ఆయన విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తమకు 21 మంది సభ్యుల మద్దతు ఉందని భారతీయ జనతా పార్టీ సభ్యులు తెలిపారు. గోవాలో మొత్తం సీట్లు 40 కాగా, మ్యాజిక్ ఫిగర్ 21. ఇటీవల ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ -13, కాంగ్రెస్-17, ఇతరులు-10 సీట్లు గెలుచుకున్నారు. ఇతరులు మనోహర్ పారికర్ కి మద్దతు తెలుపుతున్నారు.