: స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు.. బిగ్గరగా నినాదాలు.. గందరగోళం


వాయిదా అనంత‌రం ప్రారంభ‌మైన ఆంధ్రప్ర‌దేశ్ అసెంబ్లీలో గంద‌ర‌గోళం చెల‌రేగ‌డంతో స‌భ మ‌రో ప‌దినిమిషాల పాటు వాయిదా ప‌డింది. త‌మ‌కు అన్ని అంశాల‌పై మాట్లాడేందుకు స‌మ‌యం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తూ.. సభ్యులు సంప్రదాయాలు పాటించాలని చెప్పారు. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. అయిన‌ప్ప‌టికీ వారు విన‌క‌పోవ‌డంతో సభను వాయిదా వేశారు.  

  • Loading...

More Telugu News