: నాడి వేగం పెరుగుతుంది... ఊపిరి ఆగిపోతుంది: 'బాహుబలి-2' ట్రైలర్ పై జూనియర్ ఎన్టీఆర్


'బాహుబలి-2' సినిమా ట్రైలర్ పై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు రాజమౌళితో హ్యాట్రిక్ సినిమాలు చేసిన జూనియన్ ఎన్టీఆర్... ఈ సినిమా ట్రైలర్ అత్యద్భుతం అంటూ కీర్తించాడు. "మిగిలిన వాటిలా కాకుండా ఇదొక గొప్ప అనుభవం. ఈ ట్రైలర్ చూస్తుంటే నాడి కొట్టుకునే వేగం అమాంతం పెరిగిపోతుంది. ఊపిరి ఆగిపోతుంది. కను రెప్పను కూడా వేయలేరు. శభాష్ జక్కన్నా" అంటూ తారక్ ట్వీట్ చేశాడు.

ట్రైలర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయని హీరో నందమూరి కల్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు. "ఔట్ స్టాండింగ్ ట్రైలర్. ప్రభాస్, రానా, రాజమౌళి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు" అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. మరో హీరో అల్లరి నరేష్ కూడా ఈ ట్రైలర్ పై తన అనుభూతిని పంచుకున్నాడు. ఇది పక్కా కింగ్ సైజ్ ట్రైలర్ అంటూ ట్వీట్ చేశాడు. జీనియస్ రాజమౌళికి, ప్రభాస్, రానా, చిత్ర యూనిట్ కు హ్యాట్సాఫ్ అని తెలిపాడు.  

  • Loading...

More Telugu News