: రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్!
రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ వార్నర్ ఔట్ కాగా, 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెన్షా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో స్మిత్ 19, మార్ష్ 1 పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 88 (24 ఓవర్లకి)గా ఉంది. భారత బౌలర్లలో ఉమేష్, జడేజాలకు చెరో వికెట్ దక్కింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు 1-1 గా సమ ఉజ్జీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచులో గెలవడం ద్వారా సిరీస్‌లో పై చేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.