: భయాన్ని వ్యాపింపజేసి దోచుకోవడమే మావోయిస్టుల పని!: చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్
మావోయిస్టులపై చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భయాన్ని వ్యాపింపజేసి దోచుకోవడమే మావోల పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే వారి లక్ష్యమని అన్నారు. బస్తర్ జిల్లాలో విద్య, ఆరోగ్యం, కమ్యూనికేషన్ సాధనాలు, రహదారులను మావోయిస్టులు నాశనం చేశారని... వారి అసలు స్వరూపం ఇదే అని చెప్పారు. తీవ్రవాదం, ఉగ్రవాదం అనేవి ఒకే నాణేనికి ఉండే బొమ్మాబొరుసు వంటివని అన్నారు. మావోల ప్రాబల్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో సమస్యను అధిగమించేందుకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. శాంతిభద్రతలను రక్షించడానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు.
'హిందూ మహా సముద్రంలో ఉగ్రవాదం' అనే అంశంపై ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ ఢిల్లీలో ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో రాయ్ పూర్ లోని తన నివాసం నుంచే రమణ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.