: రోజాను 'ఆంటీ' అని సంబోధించడంపై బొండా ఉమ వివరణ


వైసీపీ ఎమ్మెల్యే రోజాను గతంలో ఆంటీ అని సంబోధించడంపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ వివరణ ఇచ్చారు. ఈ ఉదయం అసెంబ్లీకి వెళుతున్న సమయంలో బొండాను ఈ విషయంపై మీడియా ప్రతినిధులు క్లారిటీ అడిగారు. దీనికి సమాధానంగా "మేమేం బూతులు మాట్లాడలేదు. ఆంటీ అనే పదం చాలా గౌరవప్రదమైనది. ఆంటీ అనే పదం రోజాకు పూర్తిగా సరిపోయే గౌరవప్రదమైన పదం. నేను ఆంటీ అంటే... నన్ను తిరిగి ఏమైనా అనమనండి, కానీ, మధ్యలో తమ సహచరురాలు అనితను దూషించడం ఏమిటి?  ఓ దళిత ఎమ్మెల్యేను నోటికొచ్చినట్టు రోజా దూషించడం సరికాదు" అని బొండా ఉమ తెలిపారు.

శాసనసభలో రోజాకు ప్రత్యేకమైన చట్టాలు ఏమీ ఉండవని... చట్టం అందరికీ సమానంగానే ఉంటుందని బొండా అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఎవరి మాటలూ వినదని... సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. దళిత ఎమ్మెల్యేను దూషించిన రోజా... క్షమాపణలు చెప్పాల్సిందేనని... లేకపోతే ఆమెపై ప్రివిలేజ్ కమిటీ యాక్షన్ తీసుకుంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News