: దేవుడు పిలుస్తున్నాడంటూ సీఏ విద్యార్థి ఆత్మహత్య!


దేవుడు తనను  పిలుస్తున్నాడంటూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గజ్వేల్‌కు చెందిన డి.లోకేశ్ (22) తాను ఇంటర్మీడియెట్ చదువుకున్నప్పటి మిత్రుడు ప్రభాకర్‌తో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన సీఏ పరీక్షల్లో లోకేశ్ ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఉన్న లోకేశ్ ఈనెల 14న రాత్రి తనను దేవుడు పిలుస్తున్నాడని స్నేహితుడికి చెప్పి, అతనిని రూము నుంచి బయటకు పంపించాడు. అనంతరం పైకప్పుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News