: వ్యవసాయ రుణాల మాఫీతో క్రమశిక్షణ కట్టుతప్పుతోంది.. ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య


వ్యవసాయ రుణాల మాఫీపై ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటివల్ల క్రమశిక్షణ కట్టుతప్పుతోందని, దీనికి అలవాటైన వారు కావాలనే రుణాలు ఎగవేస్తారని పేర్కొన్నారు. ఒకసారి రుణమాఫీతో విముక్తి పొందినవారు ఆ తర్వాత కూడా మాఫీల ఆశతో రుణాలు ఎగవేస్తారన్నారు. దీనివల్ల క్రమశిక్షణ దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రైతులకు రుణమాఫీ అవసరమే అయినా అదే సమయంలో క్రమ శిక్షణ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు తాము రుణాలివ్వాలంటే తొలుత క్రమణశిక్షణ అవసరమన్నారు.



 

  • Loading...

More Telugu News