: హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల స్వీకరణకు అమెరికా గ్రీన్ సిగ్నల్.. వచ్చే నెల 3 నుంచే!
హెచ్ 1బీ వర్క్ వీసా దరఖాస్తులను వచ్చేనెల 3వ తేదీ నుంచి స్వీకరించనున్నట్టు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసుల సంస్థ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది. అయితే ఎప్పటి వరకు స్వీకరిస్తారన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. సాధారణంగా ఐదు పనిదినాలపాటు దరఖాస్తులను స్వీకరిస్తారు. గతంలో ఈ విషయాన్ని యూఎస్‌సీఐఎస్ స్పష్టంగా పేర్కొనేది. ప్రస్తుతం మాత్రం గడువు విషయాన్ని ప్రస్తావించలేదు. అక్టోబరు 1తో మొదలయ్యే 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తారు. యూఎస్‌సీఐఎస్ నిర్ణయంతో భారత ఐటీ నిపుణులు, కంపెనీలకు ఇప్పటి వరకు ఉన్న ప్రతిబంధకం తొలగిపోయినట్టే.