: సరదా ట్వీట్ కి ప్రధాని సీరియస్ సమాధానం!


గుర్గావ్ కు చెందిన కంప్యూటర్ సైన్స్ పీజీ విద్యార్థి అజిత్ సింగ్ ఇటీవల తన ట్విట్టర్ ఫాలోవర్ ఒకరు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని చూసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానిని సంతోషపరచిన ఆ సమాధానం ఏంటో తెలుసుకునే ముందు, అసలు, అతన్ని తన ఫాలోవర్ ఏమని ప్రశ్నించాడో తెలుసుకుందాం.

‘నువ్వు నరేంద్ర మోదీ కోసం పని చేస్తున్నావా?’ అని అజిత్ సింగ్ ఫాలోవర్ ప్రశ్నించాడు. అందుకు అజిత్ సింగ్ ...‘నో డియర్, ఆయనే నా కోసం పని చేస్తున్నారు..’ అంటూ సరదాగా సమాధానమిచ్చాడు. అయితే, సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ట్వీట్ విషయం తెలియడంతో ఆయన స్పందిస్తూ.. ‘కచ్చితంగా వాస్తవం. ప్రతి భారతీయుడికి నేను ప్రధాన సేవకుడిగా ఉండటమనేది చాలా సంతోషదాయకం’ అంటూ అజిత్ సింగ్ కు తన ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఈ విషయం అజిత్ సింగ్ ట్విట్టర్ ఖాతా చూస్తే అర్థమవుతుంది. ప్రధాని మోదీ నుంచి తనకు ట్వీట్ రావడం చూసిన అజిత్ సింగ్ సంతోషానికి అవధుల్లేవు.

  • Loading...

More Telugu News