: ‘జనసేన’ కండువా కప్పుకోనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి?
వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడాన్ని సంగారెడ్డి సభ నుంచి ప్రారంభించనున్నట్టు పవన్ సంకేతాలు పంపిన విషయం విదితమే. అయితే, సంగారెడ్డిలో ఈ సభ ఏర్పాటు వెనుక కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, పవన్ తో జగ్గారెడ్డికి సాన్నిహిత్యం బాగానే ఉంది. సంగారెడ్డి లో పవన్ సభ ఏర్పాట్లు దగ్గర నుంచి జన సమీకరణ వరకు తెర వెనుక ఉన్న వ్యక్తి జగ్గారెడ్డే నని వార్తలు వినిపిస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే, జనసేన పార్టీలో జగ్గారెడ్డి చేరనున్నారని, సంగారెడ్డి లో నిర్వహించనున్న భారీ సభలో జగ్గారెడ్డి జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.