: అందుకే, నా మనసులో విరాట్ కు ప్రత్యేక స్థానం వుంది!: ఆసీస్ మాజీ కెప్టెన్


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తెలిపాడు. కోల్ కతాలో తన ఆటో బయోగ్రఫీ మై స్టోరీ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా క్లార్క్ మాట్లాడుతూ, కోహ్లీ అంటే తనకు ప్రత్యేక అభిమానమన్నాడు. తన స్నేహితుడు ఫిలిప్ హ్యూస్ క్రికెట్ మైదానంలో బంతి తలకు తగలడంతో కుప్పకూలి మరణించిన సమయంలో ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న విరాట్ కోహ్లీ... ఆటకు సంబంధం లేకపోయినా అతని అంత్యక్రియలకు హాజరయ్యాడని గుర్తుచేశాడు. అలాగే సంబంధం లేకున్నా మ్యాచ్ ను వాయిదా వేసుకున్నారని, జట్టు సభ్యులతో కలిసి కోహ్లీ అంతిమ సంస్కారానికి హాజరు కావడం తానెప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. ఆ క్షణాలు తన మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పాడు. అందుకే కోహ్లీ తనకు ప్రత్యేకమని క్లార్క్ చెప్పాడు. 

  • Loading...

More Telugu News