: కృష్ణ కుటుంబానికి రూ. 50 వేలు అందించిన రేవంత్ రెడ్డి, సండ్ర
హైదరాబాదులోని ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన మహబూబ్ నగర్ జిల్లా రామారం తండావాసి కృష్ణానాయక్ కుటుంబాన్ని తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వీరయ్యలు నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. హాస్పిటల్లో ఉన్న అవినీతే కృష్ణ మృతికి కారణమని ఈ సందర్భంగా రేవంత్, సండ్ర అన్నారు. ఓ గిరిజనుడు దుర్మరణం చెందినా ప్రభుత్వానికి పట్టడం లేదని వారు విమర్శించారు. కృష్ణానాయక్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా, సొంత ఊరిలో మూడు ఎకరాల భూమి, ఓ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.